📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaతహసీల్దార్ అబూబాకర్ ఔట్

తహసీల్దార్ అబూబాకర్ ఔట్

📰 Generate e-Paper Clip

తహసీల్దార్ అబూబాకర్ ఔట్

••వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి

••రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, భూ భారతి ఆపరేటర్.

••నిందుతులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు అధికారుల వెల్లడి.

రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి

వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి, భూ భారతి ఆపరేటర్ సంకసాల అనిల్ కుమార్ పట్టుబడ్డారు.
ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమికి సంబంధించిన గిఫ్ట్ డీడ్‌ను ఫిర్యాదుదారుడి తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు అధికారికంగా సహకరించే విషయంలో ఈ లంచం తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.తహసీల్దార్ అబూబకర్ సూచన మేరకు భూ భారతి ఆపరేటర్ అనిల్ కుమార్ వద్ద నుంచి రూ.8,000 లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ తన విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.అనంతరం నిందితులిద్దరినీ కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.

*లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి*

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.