📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబచ్చన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

బచ్చన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బచ్చన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 21(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

బీఆర్ఎస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే:

బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి కర్ణాకర్ రెడ్డి సోదరుడు దాసరి కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నేరుగా వారి నివాసానికి చేరుకున్నారు. కమలాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, ఈ కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బచ్చన్నపేటలో స్థానికులతో మాటామంతీ:

అనంతరం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. టీ తాగుతున్న సమయంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యే ని కలిసి తమకు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులను సావధానంగా విన్న ఎమ్మెల్యే గారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా చూస్తానని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు:

బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామంలో మరియు బచ్చన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “దుర్గామాత ఆశీస్సులతో జనగామ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఈ పర్యటనలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.