📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!

బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!

📰 Generate e-Paper Clip

బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!

జవహర్ నగర్, అక్టోబర్ 22 (ప్రజావాణి ప్రతినిధి)

జవహర్ నగర్ బీజేఆర్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజానాయకుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయన్న సేవలను స్మరించుకున్నారు.సంఘం గౌరవ అధ్యక్షులు జింక నాగులు,బొబ్బిలి మంజుల యాదగిరి,బెజరమైన వెంకటయ్య; అధ్యక్షులు నారాయణ కనకయ్య; ఉపాధ్యక్షులు ముప్పిడి ఆంజనేయులు; కోశాధికారి పండుగ శేఖర్; జనరల్ సెక్రెటరీ ఏర్పుల పద్మారావు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
సమాజం కోసం, పేదల హక్కుల కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ముదిరాజ్ బిడ్డలంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గొడుగు పాండు, అల్లం వీరస్వామి, చీకోటి కన్నా, పెసర వెంకటేష్, గొడుగు బబులు, కొంతం రాజు, తేలు శ్రీనివాసు, పండుగ తిరుపతి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.