📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్
దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి):
మానవతా దృక్పథంతో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాజీపేట గ్రామ సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్.
ఇటీవల మరణించిన కాజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త తీగల రమేష్ కుటుంబాన్ని సర్పంచ్ లక్కాకుల వనిత సృజన్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ భార్యకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనుచరుడిగా, ఆయన మార్గదర్శకత్వంలో గ్రామంలో అభివృద్ధి పనులకు తోడ్పడుతూ సర్పంచ్ ముందుకు సాగుతున్నారు. గ్రామ అభివృద్ధితో పాటు పేద కుటుంబాలకు సహాయం అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.