📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ స్కీమ్-2016 పై అవగాహన సదస్సు

ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ స్కీమ్-2016 పై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

*ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ స్కీమ్-2016 పై అవగాహన సదస్సు*

-వయోవృద్ధుల హక్కులు, సంక్షేమ పథకాలపై చట్టపరమైన అవగాహన

-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. ప్రతిమ ఆధ్వర్యంలో సదస్సు

-వృద్ధులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ – డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి):
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), చైర్మన్ బి. ప్రతిమ ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా లోని దేవరుప్పుల మండలం, సీతారామపురం గ్రామంలోని ‘ప్రేమ సదన్ వృద్ధాశ్రమం’ లో “సీనియర్ సిటిజన్ స్కీమ్ – 2016” పై ప్రత్యేక లీగల్ అవేర్‌నెస్ సదస్సును ఘనంగా నిర్వహించారు.

వృద్ధుల హక్కులపై చట్టపరమైన అవగాహన:

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర మాట్లాడుతూ… వయోవృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, రక్షణ చట్టాల ప్రాముఖ్యతను ఆశ్రమవాసులకు వివరంగా తెలియజేశారు.

“తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంది. వృద్ధులను వేధించడం, ఆస్తి నుంచి గెంటివేయడం చట్టరీత్యా నేరం. వృద్ధాప్యంలో రావల్సిన ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన సహాయం పొందేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా 15100 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్స్ కు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకాలు, ఆరోగ్య బీమా, ఉచిత న్యాయ సహాయం, వృద్ధాశ్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఆశ్రమవాసులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేసి . వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ (PLV) బి. శేఖర్, వృద్ధాశ్రమ నిర్వాహకులు బ్రహ్మచారి ఆశ్రమ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.