📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonభారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

-జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్షాల ధర్నా

-ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఎన్నికల కమిషనర్ పై వామపక్షాల ఆగ్రహం

-బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్

జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 01 (ప్రజావాణి):

బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తూ బీజేపీ పార్టీని గెలిపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు అధ్యక్ష వర్గంగా సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, సీపీఐ పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నుండి కొనకల కళింగరాజు అధ్యక్షత వహించారు.

ఎన్నికల కమిషనర్ బీజేపీకి తొత్తుగా మారారు:

ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య మాట్లాడుతూ…

“కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రతిపక్ష పార్టీల ఓట్లను, ప్రజల ఓట్లను అక్రమంగా తొలగించి బీజేపీకి సహకరిస్తూ ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే విధంగా కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే SIR పేరుతో ఓట్లను తొలగిస్తూ భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు” అని ఆరోపించారు.

“ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వతంత్రం, భారత రాజ్యాంగం విలువల్ని పాటించకుండా ఉన్నతమైన పదవిలో ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ ఒక పార్టీకి తొత్తుగా మారి పనిచేయడం సరైనది కాదు. ప్రజాస్వామ్య విలువల్ని పాటించని ఎన్నికల కమిషనర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అని డిమాండ్ చేశారు.

అదే సందర్భంగా ఓట్లు తొలగించకుండా ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే విధంగా యంత్రాంగం చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, దీనితోపాటు ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అహల్య, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, సుంచు విజేందర్, పి. ఉపేందర్, ఎండీ హజారుద్దీన్, బోడ నరేందర్, దేవదానం సురేష్ నాయక్, సీపీఐ నాయకులు ఆకుల శ్రీనివాస్, ఎం. శ్రీశైలం, డాక్టర్ ఐలయ్య, బాణాల వెంకన్న, చామకూర యాకూబ్, నాగేష్, లిబరేషన్ నాయకులు జీడి సోమయ్య, గ్యార రాజు, తూర్పాటి సోమయ్య, పెద్ది రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో కి అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.