📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు

ఘనంగా జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి):
జనగామ పురపాలక సంఘం మున్సిపాలిటీ స్థాపించబడి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో 74వ జన్మదిన వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీ పురోగతి, పట్టణాభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కేక్ కటింగ్ వేడుక:

పురపాలక సంఘం 74 వసంతాలు పూర్తి చేసుకున్న సంతోషంతో చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ , కమిషనర్ రాజశేఖరరెడ్డి , వైస్ చైర్మన్ భూష పర్వతాలు , అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది కలసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు.

పట్టణాభివృద్ధికి పునరంకితం:

జనగామ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సేవలు:

తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, హరితహారం, మౌలిక వసతుల కల్పనలో మున్సిపాలిటీ నిరంతరం ముందుంటుందని తెలిపారు.

ఈ వేడుకలో చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.