📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguప్రజాసేవే నా రాజకీయం

ప్రజాసేవే నా రాజకీయం

📰 Generate e-Paper Clip

. బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
గురువారం భూక్య జంపన్న ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రం జంపన్న కార్యాలయం యందు నిర్వహించిన
32 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం విజయ వంతగా ముగిసింది .భూక్య జంపన్న మాట్లాడుతూ ములుగు జిల్లా లోని వివిధ మండలాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 4వైల పై చిలుకు ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చెయంచాను సుమారు
17,300 మందికి వైద్య పరీక్షలు, ఉచిత మందులు.. ప్రజలకు అండగా నిలిచిన భూక్య జంపన్న
రాజకీయాల్లో పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న అన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా ములుగు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 32 సార్లు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, ఇప్పటివరకు సుమారు 4,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. అదేవిధంగా 17,300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు అందించినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వృద్ధులు, మహిళలు, పేదలు కంటి చూపు కోల్పోకుండా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, తాను గత రెండున్నర సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని జంపన్న తెలిపారు.నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. రాజకీయం అంటేనే ప్రజాసేవ. గెలిస్తే అసెంబ్లీలో కూర్చోవడం, ఓడిపోతే ఇంట్లో కూర్చోవడం నా విధానం కాదు. ప్రజలకు అవసరమైన ప్రతి సమయంలో, నా శక్తి మేరకు అండగా నిలవడమే నా రాజకీయ విధానం. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతాను” అని భూక్య జంపన్న స్పష్టం చేశారు.
గత రెండున్నర సంవత్సరాలుగా వైద్యం, విద్య, ఉపాధి, ఆపదలో ఆర్థిక సహాయం తదితర రంగాల్లో సుమారు 20 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా అండగా నిలిచినట్లు ఆయన తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు ఇకముందు కూడా నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు.
జంపన్న మా పెద్ద కొడుకులా అండగా నిలిచారు” – లబ్ధిదారులు
ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా లబ్ధి పొందిన పేదలు, వృద్ధులు మాట్లాడుతూ.. “జంపన్న నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాల ద్వారా మాకు మళ్లీ కంటిచూపు వచ్చింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే నాయకులు సమాజానికి అవసరం” అని అన్నారు.
మమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడమే కాకుండా, ఆపరేషన్ అనంతరం కూడా మా ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటూ జంపన్న గారు మా వెంట నిలిచారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించిన ఆయనకు జీవితాంతం కృతజ్ఞతలు” అని లబ్ధిదారులు పేర్కొన్నారు.
జంపన్న మా కుటుంబంలో పెద్ద కొడుకులా అండగా నిలిచారు. భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి అవసరం వచ్చినా మా వంతు సహకారం, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటాయి” అని వారు భావోద్వేగంగా తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భూక్య జంపన్న తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.