📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNSS ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్య క్రమం

NSS ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్య క్రమం

📰 Generate e-Paper Clip

NSS ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్య క్రమం

ప్రజావాణి అక్టోబర్ 1 గూడూరు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కమలాపూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ జి కుమార్ అధ్యక్షత వాయించారు కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ కంటి వైద్య శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు

పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన రాలీలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పచ్చదనం పరిశుభ్రత మన బాధ్యత వంటి నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు

ఈ కార్యక్రమానికి గూడూరు గ్రామా సర్పంచ్ బండి వనజ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు పచ్చదనం పెంపొందించడంలో ముందుండాలని ఆమె అన్నారు

అనంతరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రఘుపతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉద్దేశించి ప్రేమత్మక ప్రసంగం చేశారు ఈ విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన సేవా భావం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఎన్ఎస్ఎస్ ద్వారా పొందే అనుభవాలను సమాజ సేవకు ఉపయోగపవాలని
సూచించారు

కంటి వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి ఆరోగ్యం పై అవగాహన కల్పించి అవసరమైన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ జ్యోతి ముఖ్యఅతిథిగా సర్పంచ్ బండి వనజ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రఘుపతి కళాశాల అధ్యాపకులు గ్రామ పెద్దలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవా భావంతో కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ Horlicks ఆరోగ్యం అవగాహన మరియు సామాజిక బాధ్యతలపై ప్రజలకు చైతన్యం కల్పించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.