గ్రామంలో కోతుల బెడద
ప్రజావాణి అక్టోబర్ 1 కమలాపూర్ మండలo లోని గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో రోడ్డుపై వెళ్లాలంటే ప్రజలు భయపడుతూ వెళ్తున్నారు రోడ్డుపై వెళుతుంటే అమాంతం పైన పడి కొరికేస్తున్నాయి గ్రామంలోని వీధులు ఇండ్ల పరిసరాల్లో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం చిన్నపిల్లలపై వృద్ధులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడదను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు

