📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గమ్యం లేని ప్యాకేజీల ప్రయాణం మానుకొని.. రాజ్యాధికారం దిశగా పనిచేయండి

గమ్యం లేని ప్యాకేజీల ప్రయాణం మానుకొని.. రాజ్యాధికారం దిశగా పనిచేయండి

📰 Generate e-Paper Clip

గమ్యం లేని ప్యాకేజీల ప్రయాణం మానుకొని.. రాజ్యాధికారం దిశగా పనిచేయండి

మాదిగ నాయకులకు దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పవరపు గోపి పిలుపు

ప్రజావాణి దినపత్రిక – ప్రకాశం జిల్లా బ్యూరో | అక్టోబరు 10

మాదిగ అమరవీరుల త్యాగాలను వమ్ము చేయకుండా, రాజ్యాధికారం సాధించే దిశగా మాదిగ నాయకులు పనిచేయాలని దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పవరపు గోపి పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది మాదిగ విద్యార్థులు, కార్యకర్తల ప్రాణత్యాగాలు, మాదిగ తల్లుల ఆశీస్సులతో సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనంతరం, ఆ త్యాగాల ఫలితాలను సార్థకం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. రాజ్యాధికారం సాధించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.

కొంతమంది స్వార్థపరులైన మాదిగ నాయకులు అమరవీరుల త్యాగాలను వమ్ము చేస్తూ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్యాకేజీలకు ప్రాధాన్యమిస్తూ, అగ్రవర్ణ రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. అధిక ఓటు బలం కలిగిన దళితులను ఏకం చేసి, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారం దిశగా నడిపించాల్సిన నాయకులు, గమ్యం లేని రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, దళిత సమాజం రాజకీయంగా ఎదిగి అధికారంలో భాగస్వామ్యం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉద్యమాలను పక్కదారి పట్టించకుండా, శాశ్వతంగా జాతి అభివృద్ధికి ఉపయోగపడే కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు.

మాదిగ అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకొని, జాతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించే నాయకుల వైఖరిని ప్రజలకు తెలియజేస్తూ, దళితుల హక్కుల సాధన కోసం ముందువరుసలో నిలిచి పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.