గురువారం దాకా ఇసుక సరఫరా బంద్..!
*క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే అంటూ తాహసిల్దార్ హడావుడి..?
*పత్తాలేని ట్రాన్స్పోర్ట్.. మైనింగ్ శాఖలు..?
సమగ్ర చర్యలు తీసుకోవాలంటున్న మధిర నియోజకవర్గ ప్రజలు
ఇసుక అక్రమాలపై” మన ప్రజావాణి” ప్రత్యేక కథనాలకు
స్పందన.
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు ఇసుక రీచ్ నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ఓసీలు లేకుండా.. ఓటీపీలు లాగిన్లు లేకుండా ఎటువంటి రికార్డులు పొందుపరచకుండా గత 45 రోజులుగా సాగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం వసూళ్ల వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో గత కొన్ని రోజులుగా సంచలన సమగ్ర వార్తా కథనాలు అందిస్తున్న సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పాఠకులకు జిల్లా యంత్రాంగాలకు తెలిసింది. ఈ నేపథ్యంలో గత నెల సుమారు 16వ తారీకు నుండి ఇంచార్జి జిపిఓ చింతకాని మండలం చిన్న మండవలో ప్రభుత్వ ఇసుక రీచ్ వద్ద విధులు నిర్వహిస్తూ మాన్యువల్ బిల్లులకు ఆమోద ముద్ర వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో ఆలస్యంగా జిల్లా స్థాయి అధికారులు మరోమారు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మైనింగ్ శాఖలో సరైన సిబ్బంది లేరు అనే వంక చూపిస్తున్నట్లు రాజకీయ ఒత్తిడి మేరకు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడిన కొందరు అధికారులు క్షేత్రస్థాయి నుండి మండల డివిజనల్ జిల్లా స్థాయి వరకు కాసులను ఎరగా చూపి ప్రభుత్వ ధనానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర ఆధారాలతో వార్తా కథనాలకు ప్రభుత్వ ఇసుక సరఫరా నేటి నుండి గురువారం వరకు ఆగిపోయినట్లు సమాచారం. ఇదే ప్రాంతానికి మండల తాహ సిల్దార్ సమగ్ర భూ సర్వే పేరుతో సోమవారం మధ్యాహ్నం హాజరై ఇసుక ప్రాంతాన్ని పరిశీలించలేదని పలువురు మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాగా ఈ ప్రాంతంలో విధులు నిర్వహించే కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం అందింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కాగా ఈ వ్యవహారంలో రోజుకు 30 వేల రూపాయల పైగా అక్రమాలు లావాదేవీలు నడిచినట్లు గతంలో ఇంతకంటే ఎక్కువ నడిచినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై చింతకాని తహసిల్దార్ కరుణ శ్రీ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు నిరాకరించారు. గత రెండు రోజులుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పందించకపోవడం విశేషం. కాగా కూపన్ లు నిలిపివేశారు కానీ కొన్ని ట్రాక్టర్లు యధావిధిగా ఇసుకను తరలించడం సంచలనగా మారింది.
మరికొన్ని సమగ్ర వివరాలతో తరువాయి కథనంలో..!


