📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఎస్ఐ గోవర్ధన్‌ను సత్కరించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం

ఎస్ఐ గోవర్ధన్‌ను సత్కరించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం

📰 Generate e-Paper Clip

ఎస్ఐ గోవర్ధన్‌ను సత్కరించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం

చెన్నారావుపేట అక్టోబర్ 26 ప్రజావాణి

చెన్నారావుపేట మండల పోలీస్ స్టేషన్‌కు కొత్తగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) గోవర్ధన్‌ను సోమవారం వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని వారు శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం సంఘం మండల అధ్యక్షులు ఈగ సత్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో సీనియర్ సిటిజన్లకు చట్టబద్ధమైన భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వృద్ధుల సమస్యల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుతూ ఎస్ఐ గోవర్ధన్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి ములుక సాంబయ్య తాను రచించిన కవితా సంకలన గ్రంథాన్ని ఎస్ఐకి బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు వరంగంటి మల్లయ్య, కుమారస్వామి, తాలపెల్లి నర్సయ్య, కంది నారాయణరెడ్డి, గట్ల కృష్ణ, ముత్యం సాంబయ్య, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.