📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

వేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ స్మార్ట్ కార్డులను ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పంపిణీ చేశారు. స్థానిక రేషన్ దుకాణం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడంతో పాటు, లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు పైళ్ల లతా రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు నానావత్ సురేష్ నాయక్, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.