📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆరుట్ల గ్రామంలో బెల్ట్‌ షాపులను మూసివేయాలి

ఆరుట్ల గ్రామంలో బెల్ట్‌ షాపులను మూసివేయాలి

📰 Generate e-Paper Clip

*ఆరుట్ల గ్రామంలో బెల్ట్‌ షాపులను మూసివేయాలి*

*ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్‌ మానిపాటి శోభాకుమార్‌,* *ఉపసర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌*

రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 27 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో బెల్ట్‌ షాపులను నియంత్రించి, పూర్తిగా మూసివేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ మానిపాటి శోభాకుమార్‌, ఉపసర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం ఎక్సైజ్‌ శాఖ అధికారులకు, మంచాల పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించి, గ్రామంలో బెల్ట్‌ షాపుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మానిపాటి శోభాకుమార్‌, ఉపసర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌ మాట్లాడుతూ.. గ్రామంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే గ్రామ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేటి యువతే రేపటి పౌరులని, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

గ్రామంలో బెల్ట్‌ షాపుల నియంత్రణకు గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామంలో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామ అభివృద్ధితో పాటు యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి, ఆరుట్ల గ్రామంలో బెల్ట్‌ షాపులపై నియంత్రణ విధించి, వాటిని మూసివేసేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.