దాదాపూర్‌లో వైభవంగా శ్రీ సాయిబాబా మందిర వార్షికోత్సవం.. హాజరైన బీజేపీ నేత కరణం ప్రహ్లాద్ రావు
పరిగి / దోమ, అక్టోబర్ 27 (ప్రజావాణి):
దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ సాయిబాబా మందిర వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలంతా సుఖసంతోక్షాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థులు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా నామస్మరణతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు మహా తీర్థప్రసాద పంపిణీ ఘనంగా నిర్వహించారు
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్
సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి
ఎన్నికల కో-కన్వీనర్ మల్లేష్
మండల ఉపాధ్యక్షులు కొండ ఆంజనేయులు
యువ నాయకులు నీరటి సంజీవ్, పోలేమోని రమేష్, నరేష్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
బాబా కృపతో దాదాపూర్ గ్రామం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

