📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సమస్యల పరిష్కారానికి కృషి: కాంగ్రెస్

కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సమస్యల పరిష్కారానికి కృషి: కాంగ్రెస్

📰 Generate e-Paper Clip

మేడ్చల్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

TWU అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం.. కార్మికుల సంక్షేమమే లక్ష్యమన్న నాయకులు

మేడ్చల్: అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. డిపో గౌరవ అధ్యక్షులు సాటే నరేందర్ వంజరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో కార్మికులను కలిసి ఎన్నికలపై అవగాహన కల్పించారు.

కాంగ్రెస్ పార్టీతో పాటు INTUC/SWU, TMU, SWF మద్దతు ప్రకటించిన TWU అభ్యర్థులకు కార్మికులు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటు వేసి TWU అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ 297వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్, డిపో గౌరవ అధ్యక్షుడు సాటే నరేందర్ వంజరి తెలిపారు.

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారం ద్వారానే సంస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ-బ్లాక్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ ఆలీ, మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్ కురుమ, జాకట దేవరాజ్, కౌడే మహేష్ కురుమ, పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, నారెడ్డి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నడికొప్పు రంజిత్ ముదిరాజ్, వేముల శ్రీనివాస్ రెడ్డి, గువ్వ రవి ముదిరాజ్, ఉదండపురం సత్యనారాయణ, సల్ల వెంకటేష్ యాదవ్, రామన్నగారి సంతోష్ గౌడ్, లవంగు రాకేష్ వంజరి తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆర్టీసీ యూనియన్ నాయకులు శేఖర్, శివ, జ్ఞానేశ్వర్, మధు, ఆనంద్, రాజు, రాజేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.