📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అంగన్‌వాడీల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట: జల్లి శైలజ హరినాథ్

అంగన్‌వాడీల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట: జల్లి శైలజ హరినాథ్

📰 Generate e-Paper Clip

అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలం

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా రైలాపూర్, మేడ్చల్ అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన

కేంద్ర పథకాల అమలుపై పరిశీలన.. అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

మేడ్చల్ (ప్రజా వాణి): మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’–‘సేవా పఖ్వాడా’లో భాగంగా ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని రైలాపూర్, మేడ్చల్ అంగన్‌వాడీ కేంద్రాలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి జల్లి శైలజ హరినాథ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ అభియాన్’ (పోషణ్ 2.0) ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ పోషకాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. ‘సక్షమ్ అంగన్‌వాడీ’ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, పారిశుధ్యం, స్మార్ట్ పరికరాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ‘పీఎం మాతృ వందన యోజన’ వంటి పథకాల ద్వారా అర్హులైన గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీ తీరును పరిశీలించిన జల్లి శైలజ హరినాథ్.. కేంద్రాల్లోని మౌలిక వసతులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో అంకితభావంతో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు ధనలక్ష్మి, రాధిక, ఏఎన్‌ఎం పద్మావతి, ఆశా కార్యకర్తలు సునీత, తులసి, మంజులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి, సీనియర్ నాయకులు చీర్ల సత్యనారాయణ, స్థానిక నాయకులు మామిళ్ల నర్సింగ్ రావు, పెంట రెడ్డి, హనుమంత్ రెడ్డి, మేడ్చల్ మహిళా మోర్చా నాయకురాలు మల్లాది హేమలత రెడ్డి, జంగం అనిత, నాయకులు మహేష్ గౌలికర్, జకట బాబు రాజు, మరిగల ప్రణయ్, పురుషోత్తం, ఎర్రబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.