📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కందకట్ల సందీప్ రెడ్డి నియామకం

ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కందకట్ల సందీప్ రెడ్డి నియామకం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 15 (ప్రజావాణి): మేడ్చల్‌–మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలోని ఎదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కమిటీ నియామకాల్లో భాగంగా కందకట్ల సందీప్‌ రెడ్డిని డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ అధ్యక్షతన ఈ నియామకం జరిగింది.

ఈ సందర్భంగా సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేశ్‌ గౌడ్‌, ఎదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సామల అమరేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, పార్టీ పెద్దల సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజలకు మరింత సేవ చేసేందుకు నిరంతరం పనిచేస్తానని తెలిపారు.

అలాగే నూతన డివిజన్‌ కమిటీలో నియమితులైన సహచరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఔషాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, యువజన నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.