📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం సర్పంచ్ నర్సు కృ

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం సర్పంచ్ నర్సు కృ

📰 Generate e-Paper Clip

*గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం:- సర్పంచ్ నర్సు కృష్ణ*

*గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు.. వివిధ ప్రాంతాల్లో మరమ్మతు పనులు*

మనోహరాబాద్ ప్రజావాణి:- మనోరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని సర్పంచ్ నర్సు కృష్ణ తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను పరిశీలించి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతో పాటు, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరోజుతో పూర్తయ్యే ప్రక్రియ కాదని, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సమన్వయంతో నిరంతరం కొనసాగాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అవసరమైన మరమ్మతు పనుల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని సర్పంచ్ నర్సు కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, కారోబార్ హబీబ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.