ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కందకట్ల సందీప్ రెడ్డి నియామకం
ఘట్కేసర్, అక్టోబర్ 15 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ నియామకాల్లో భాగంగా కందకట్ల సందీప్ రెడ్డిని డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,...