బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే దంపతులు..
తెలంగాణ సాంప్రదాయానికి బతకమ్మ ప్రతీక..
ఎమ్మెల్యే డా.మురళి నాయక్
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో బండారి పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్,డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారథి, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గ, వివిధ గ్రామాల సర్పంచులు, ఐకెపి, ఉపాధి సిబ్బంది తోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.రంగురంగుల పూలతో రంగుల గోపురాల్లా బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ కోలాట ఆట పాటలతో ఆడి పాడారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
ప్రకృతిని స్త్రీ శక్తిని జీవన విధానాన్ని ఆరాధించే పూల పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు.మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.అనంతరం ఇనుగుర్తి గ్రామపంచాయతీకి ఐసిడిఎస్ కు రెవెన్యూ శాఖ నుంచి ఒక్కొక్కరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ్మడపల్లి కుమార్ రజిని దంపతులు,బానోతు రేణుక నరేష్,ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి,చెడుపాక సుజాత యాకయ్య,మీటు నాయక్, ఇస్లావత్ నరేష్,నూనావత్ బద్రు నాయక్, భూక్య లక్ష్మీ వెంకన్న,భూక్య చిన్ని వెంకన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు, రెవిన్యూ ఎంపీడీవో ఐసిడిఎస్ ఉపాధి హామీ ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

