📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన బాబు,

ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన బాబు,

📰 Generate e-Paper Clip

ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన బాబు,

జవహర్ నగర్, అక్టోబర్ 10 ( ప్రజావాణి ప్రతినిధి )

శ్రీమతి ముమ్మారెడ్డి హేమలత, భర్త: స్వర్గీయ సందీప్, వయస్సు: 48 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, కులం: రెడ్డి, నివాసం: ఇంటి నం. 111, సాయిప్రియ కాలనీ, దమ్మాయిగూడ కీసర మండలం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాలు ఏమనగా, తేదీ 09.10.2026 ఉదయం తన కుమారుడైన శ్రీ ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి, తండ్రి: స్వర్గీయ సందీప్, వయస్సు: 17 సంవత్సరాలు, వృత్తి: విద్యార్థి (గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, చేర్యాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం) ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం సుమారు 1700 గంటల సమయంలో, తన కుమారుడి స్నేహితులు మరియు పోలీసులు ఫోన్ చేసి, తన కుమారుడు మల్కారం క్వారీలోని నీటిలో మునిగిపోయాడని సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని, తన కుమారుడి స్నేహితులైన వైభవ్, భార్గవ్, శ్రీశాంత్ రెడ్డి, డి. తారకరామ్, ఎం. రిషి వర్ధన్ మరియు మయాంక్ కుమార్‌లను విచారించగా, వారందరూ కలిసి ఈత కొట్టడానికి వెళ్లామని, ఈత కొడుతున్న సమయంలో తన కుమారుడు నీటిలో మునిగిపోయాడని తెలిపారు. అనంతరం పోలీసుల మరియు రెస్క్యూ బృందాల సహాయంతో నీటిలో నుండి తన కుమారుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే తన కుమారుడు మరణించినట్లు గుర్తించారు. కావున, పై ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారురాలు కోరగా, కేసు నమోదు చేయబడినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.