📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండల్ పంగిడిపల్లి గ్రామంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలకు నాంది పలుకుతూ మహిళలు తొలిరోజైనా ఎంగిలిపూల బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య వైభవంగా నిర్వహించారు
వివిధ రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకలలో పాల్గొన్నారు
బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ ఆడుతూ గ్రామంలో పండుగ శోభను సంతరించుకున్నాయి

బతుకమ్మ పండుగ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదు అక్కాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీక బతుకమ్మ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రేమానురాగాలకు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి గ్రామాల్లో మహిళలు యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.