📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవెల్దండలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు పనులు వేగవంతం

వెల్దండలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు పనులు వేగవంతం

📰 Generate e-Paper Clip

వెల్దండలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆదేశం.

నాగర్ కర్నూల్ జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

వెల్దండ, అక్టోబర్ 10 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బతుకమ్మ ఘాట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఘాట్ల పనులను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలు సురక్షితంగా, సౌకర్యవంతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చెరువు కట్ట వద్ద లైటింగ్, శుభ్రత, భద్రతా చర్యలు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పండుగ లోపు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు. గ్రామంలోని మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుని ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్ వార్డు సభ్యులు గుద్దటి కిష్టల్, గజినీ శ్రీను, ఏర్ల వెంకట్ రెడ్డి, మట్ట మల్లేష్ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.