📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి మినీ అండర్ 13 పోటీలకు ధూళిమిట్ట విద్యార్థినులు

రాష్ట్ర స్థాయి మినీ అండర్ 13 పోటీలకు ధూళిమిట్ట విద్యార్థినులు

📰 Generate e-Paper Clip

రాష్ట్ర స్థాయి మినీ అండర్ 13 పోటీలకు ధూళిమిట్ట విద్యార్థినులు

మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి,

ఈనెల 11 నుండి 12 వరకు నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి లో జరిగే 11వ అంతర్ జిల్లా అండర్ 13 సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ కు ధూళిమిట్ట పాఠశాలకు చెందిన 6గురు విద్యార్థినిలు ఎంపికై రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి తెలియజేశారు,జిల్లా సెక్రెటరీ రేణుక మాట్లాడుతూ ధూళిమిట్టలో ప్రతిభగల విద్యార్థులు ఉన్నారని వారికి సరైన వసతులు మరియు మరింత ప్రోత్సాహం అందిస్తే రాబోయే రోజులలో ధూళిమిట్ట విద్యార్థులు మరింత రాణిస్తారని అన్నారు.ఎంపికైన విద్యార్థినిలను పాఠశాలలో క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వెగ్గలం సతీష్ కుమార్ ను ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ గునుకుల లీల జగన్ మోహన్ రెడ్డి ,గ్రామస్తులు,సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి కైలాసం గుప్త ,సెక్రెటరీ రేణుక మరియు ఉపాధ్యాయ బృందం, పత్రికా విలేఖరి సతీష్, శిక్షకులు నవీన్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.