📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅయోధ్యాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ మిన్నింటిన సంబరాలు

అయోధ్యాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ మిన్నింటిన సంబరాలు

📰 Generate e-Paper Clip

*అయోధ్యాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ మిన్నింటిన సంబరాలు*

*బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతిక చిహ్నం*

*ప్రకృతిని స్త్రీ శక్తిని ఆరాధించే పూల పండుగ*

*బతుకమ్మ అంటే “జీవించు అమ్మా”*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 10. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మిన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమంతా ఆటపాటలతో సందడిగా మారింది. మహిళలు, యువతులు అందరు ఉత్సాహంతోపాల్గొని ఎంగిలిపూల వేడుకలను, ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతికి చిహ్నం, అలాగే ప్రకృతిని స్త్రీ శక్తిని ఆరాధించే పూల పండుగ. బతుకమ్మ అంటే “జీవించు అమ్మ” లేదా దేవత బతికింది/ అమ్మ బతుకుతాడు అని అర్థం. గౌరీ దేవిని (పార్వతీ దేవిని) ప్రకృతి రూపంలో కొలుస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. సాధారణంగా పూలను దేవుని పూజకు ఉపయోగిస్తారని, అయితే ప్రకృతిలో సహజంగా లభించే తంగేడు, బంతి పూలను, చెరువు, కుంటలలో లభించే తామర పువ్వులను రకరకాల పూలను ఉపయోగించి మహిళలు ఉపవాసం నిష్టతో, బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగని, అంతేగాకుండా కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ, తెలంగాణ ప్రత్యేకతను, మహిళల ఐక్యతను, ప్రకృతిపట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని మహిళలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో అయోధ్యాపురం మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.