*ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి పట్టణ మహిళలతో కలిసి పాల్గొన్న పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..
“తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధిస్తూ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెబుతుందని, బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, ఆనందాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, తెలంగాణ ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

