📄 ePaper
Epaper 2
Friday, October 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

*అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు*

*మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు తీర్పు.. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం*

మేడ్చల్, అక్టోబర్ 23 (పీపుల్స్ డైరీ):

అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 485/2015, సెషన్స్ కేసు నంబర్ 487/2018లో ఈ తీర్పు వెలువడింది.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అత్యాచారం, పోక్సో కేసుల త్వరిత విచారణ, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె. వెంకటేష్ ఈ తీర్పును వెలువరించారు. కేసులో నిందితుడైన హైదరాబాద్‌లోని బోరబండ, నందనగర్‌కు చెందిన సయ్యద్ గౌస్ (65)ను దోషిగా నిర్ధారిస్తూ వివిధ సెక్షన్ల కింద శిక్షలు విధించారు.

*వివిధ సెక్షన్ల కింద శిక్షలు*

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2)(f) కింద జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. అలాగే సెక్షన్ 376(2)(i) కింద జీవిత ఖైదు, రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 506 కింద ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
పోక్సో చట్టంలోని సెక్షన్ 3తో పాటు సెక్షన్ 4 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. అదేవిధంగా పోక్సో చట్టంలోని సెక్షన్లు 5(i), 5(ii)తో పాటు సెక్షన్ 6 కింద జీవిత ఖైదు, రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.

*బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం*

ఈ కేసులో బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది జి. ప్రభాకర్ రెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. అత్యాచారం, బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించే దిశగా ఈ తీర్పు వెలువడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.