PR డిప్యూటీ మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన*
*మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్*
*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా*
నారాయణఖేడ్ నియోజకవర్గం PR డిప్యూటీ మధుసూదన్ రెడ్డి, RI మాధవరెడ్డి తల్లి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న
నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్ ఈరోజు అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చాప్టా కె గ్రామ ఉపసర్పంచ్ బస్వరాజ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

