అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

*అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు* *మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు తీర్పు.. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం* మేడ్చల్, అక్టోబర్ 23 (పీపుల్స్ డైరీ): అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 485/2015, సెషన్స్ కేసు నంబర్ 487/2018లో ఈ తీర్పు వెలువడింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అత్యాచారం, పోక్సో కేసుల త్వరిత విచారణ, పరిష్కారం కోసం...