📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు

రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు

📰 Generate e-Paper Clip

*రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు…?*

*రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన..!*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23*

తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యం తో పాటు పలు నిత్యా వసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశం పై కసరత్తు చేస్తోంది.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రేషన్ షాపుల ద్వారా గోధుమపిండి , కంది పప్పు , పామాయిల్ ప్యాకెట్ , పంచదార , చింతపండు , కారం పొడి వంటి సరుకులు కూడా తక్కువ ధరలకు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల ధరలు , పంపిణీ చేసే పరి మాణం , అమలు విధానం పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే , ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.