EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు — ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు

“విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, ఆ పోరాటాన్ని అడ్డుకునేందుకు టేక్మల్ మండల బీజేపీ నాయకులను ప్రభుత్వం ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమస్యపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ చతగనితనం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీజేపీ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది సాధ్యం కాదు.

విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.

అక్రమ అరెస్టులు ఆపాలి — ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి!”

— REDYA Nayak
BJPTelangana GiriJanamorcha
executive member
బీజేపీ పార్టీ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.