ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు — ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు “విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, ఆ పోరాటాన్ని అడ్డుకునేందుకు టేక్మల్ మండల బీజేపీ నాయకులను ప్రభుత్వం ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమస్యపై ప్రశ్నిస్తున్న...