📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు

మేడ్చల్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

మేడ్చల్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు

*చౌక ధరల దుకాణాల్లో రికార్డుల పరిశీలన*

*సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో వంటగది తనిఖీ*

మేడ్చల్ పట్టణంలో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కూడిన బృం

దం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణను పరిశీలించింది. తొలుత పట్టణంలోని పలు చౌక ధరల (రేషన్) దుకాణాలను సందర్శించిన కమిషన్ చైర్మన్, సభ్యులు నిల్వ ఉన్న సరుకుల వివరాలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన బియ్యం, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని డీలర్లను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం మేడ్చల్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలను కమిషన్ బృందం సందర్శించింది. అక్కడి వంటగది, నిత్యావసర సరుకుల నిల్వలను, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉండాలని, వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఆయా శాఖల అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.