📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్

📰 Generate e-Paper Clip

గుండ్లపోచంపల్లి, గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజలు

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్ ప్రజావాణి:- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి, గౌడవల్లి గ్రామాల్లో వివిధ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయా మండపాల్లో నిర్వ

హించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని వినాయక స్వామివారికి పూజలు నిర్వహించారు. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయా మండపాల్లో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.