ఇంటిలోను తీర్చలేక మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య.
ఇంటిపైన తీసిన లోన్ ఎలా తీర్చాలి అనే మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరబాద్ మండల రంగయ్యపల్లి లో చోటు చేసుకుంది.ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి పెద్దబాల యాదగిరి నాగవ్వ కి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు హరిప్రసాద్ ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.కొన్ని నెలల క్రితం ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నారు.ఈ మధ్యనే హరిప్రసాద్ కి రోడ్డు ప్రమాదం లో కాలు విరిగింది .అప్పటి నుండి సరిగా పని చేయలేక పోవడంతో ఇంటి ఈఏంఐ ఆగింది దీంతో మనస్థాపానికి గురైన అతను బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం కు అని వెళ్లి పొలం దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.తండ్రి యాదగిరి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

