📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మనోహరాబాద్: ఇంటి ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో యువకుడు బలవన్మరణం

మనోహరాబాద్: ఇంటి ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో యువకుడు బలవన్మరణం

📰 Generate e-Paper Clip

మనోహరాబాద్: ఇంటి ఈఎంఐలు చెల్లించలేక మనస్తాపంతో యువకుడు బలవన్మరణం

మనోహరాబాద్: (ప్రజావాణి) ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో చోటుచేసుకుంది.

ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దబాల యాదగిరి, నాగవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హరిప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇల్లు నిర్మించుకునేందుకు రుణం తీసుకున్నారు.

అయితే, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిప్రసాద్ కాలు విరిగింది. దీంతో అప్పటి నుంచి సరిగా పనిచేయలేకపోవడంతో ఇంటి రుణానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రుణం ఎలా తీర్చాలనే ఆందోళనతో మనస్తాపానికి గురైన హరిప్రసాద్ బుధవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం పొలం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.