📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyరుద్రారం లో గణేష్ లడ్డుకు భారీ ధర....... రూ2.10 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న గుర్రాల...

రుద్రారం లో గణేష్ లడ్డుకు భారీ ధర…
…. రూ2.10 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి…

📰 Generate e-Paper Clip

రుద్రారం లో గణేష్ లడ్డుకు భారీ ధర…
…. రూ2.10 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి…
‘ రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 25. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ప్రతిష్టాపించిన వినాయకుడి లడ్డు వేలం పాట. ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. రూ2.10 లక్షలకు మొదటి లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరోతో గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయకుడి ప్రసాదమైన లడ్డును దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తి విశ్వాసాలతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఐక్యత పెంపొందిస్తాయని అన్నారు. గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో  ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సౌభాగ్యం వెల్లివిరియాలని రుద్రారం గ్రామం వారంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు. భజనలతో సందడి నెలకొంది. శోభయాత్ర అనంతరం వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు.



.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.