హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదానం
జై తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
మేడ్చల్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297వ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో జై తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు మారిగల సాయి కుమార్ (బబ్లూ)తో పాటు ఎం.నవీన్, నిఖిల్, సాయి, విశాల్, శేఖర్, రాహుల్, నాని, రఘు, మణి, హర్ష, చరణ్, ప్రదీప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది.

