📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వికసిత్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు

వికసిత్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు

📰 Generate e-Paper Clip

*వికసిత్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు

*

*విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: జల్లి శైలజ హరినాథ్*

మేడ్చల్, నేడు న్యూస్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో అత్వెల్లీ గ్రామంలోని నారెడ్డి నందనరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దేశ అభివృద్ధి, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా శక్తి, ప్రతిభ, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలని సూచించారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారని శైలజ హరినాథ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ, సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమలోని ప్రతిభను వెలికితీసుకోవాలని నాయకులు సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి లవంగం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జాకెట్ ప్రేమ్ దాస్, మున్సిపల్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, బండి విష్ణు, గౌరీకార్ మహేష్, కేశవరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు, ఉపాధ్యాయులు నవీన్, ప్రభాకర్, రాంబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.