📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyమైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో పరిశ్రమల పండగ

మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో పరిశ్రమల పండగ

📰 Generate e-Paper Clip

*మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో పరిశ్రమల పండగ*

*ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరు*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 ప్రజావాణి


ఐతాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణలో ఆధునిక సాంకేతిక రంగానికి మరింత ఊతమిచ్చేలా డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్‌ కొత్త క్లౌడ్ రీజియన్ తెలంగాణలో ప్రారంభమైనట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో డేటా సెంటర్ సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.సరి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ స్వామి మద్దూరు మల్లేష్ మహేందర్ గౌడ్ వెంకటేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ యాజమాన్యం పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.