*జనగామ మున్సిపాలిటీలో సహపంక్తి భోజనం – సిబ్బందితో కలిసి భోజనం చేసిన చైర్ పర్సన్*
*16 నూతన చెత్త సేకరణ ఆటోల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
జనగామ మున్సిపాలిటీలో నూతనంగా కొనుగోలు చేసిన 16 చెత్త సేకరణ ఆటోల ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు మరియు అధికారులకు ఘనంగా సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ గారు అందరితో కలిసి ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మనమంతా ఒక కుటుంబం. జనగామ అభివృద్ధి కోసం అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది అందరం కలిసి కట్టుగా పని చేయాలి. ఈ సహపంక్తి భోజనం మనలో ఐక్యతను మరింత పెంచుతుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూష పర్వతాలు , కమిషనర్ రాజశేఖరరెడ్డి కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

