అధ్యక్షుడిగా తడిసిన రాజిరెడ్డి..
ఉపాధ్యక్షుడిగా కేడిక మధుసూదన్‌రెడ్డి
బెజ్జంకి, అక్టోబర్ 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా తడిసిన రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కేడిక మధుసూదన్‌రెడ్డి, క్యాషియర్‌గా దూశెట్టి తిరుపతిరెడ్డి, కోశాధికారిగా చాడా రామ్‌ధర్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా చాడ వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా సంపతి రాజిరెడ్డి, దూశెట్టి నారాయణరెడ్డి, చాడ గోవర్ధన్‌రెడ్డి, దూశెట్టి లింగారెడ్డి, మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, సంపత్ యాదిరెడ్డి రెడ్డి సంఘ సభ్యుల సమక్షంలో ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

