📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetమహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష  ...

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష   రూ.5.01 లక్షల జరిమానా విధించిన సిద్దిపేట 1వ అదనపు జిల్లా జడ్జి

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, సెప్టెంబర్,30:సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు దండవేని ఇస్తారి (58)కి సిద్దిపేట 1వ అదనపు జిల్లా జడ్జి వై. జయప్రసాద్ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,01,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళపై దండవేని ఇస్తారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2019 ఏప్రిల్ 27న కోహెడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.కేసును అప్పటి హుస్నాబాద్ సీఐ ఎ. శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టి, సంఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మారాములు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.కేసు విచారణలో ప్రస్తుత హుస్నాబాద్ సీఐ కే. శ్రీధర్, సాక్ష్యాలను నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ జె. వేణుగోపాల్, భరోసా ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ బి. దుర్గ, భరోసా లీగల్ అధికారి సౌమ్యతో పాటు భరోసా సిబ్బంది సమన్వయంతో సహకారం అందించారు.న్యాయస్థానంలో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన సిద్దిపేట 1వ అదనపు జిల్లా జడ్జి వై. జయప్రసాద్ నిందితుడు దోషిగా నిర్ధారించారు. దీంతో దండవేని ఇస్తారికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,01,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చేయడంలో రాజీ పడబోమని సీపీ స్పష్టం చేశారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.