మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.5.01 లక్షల జరిమానా విధించిన సిద్దిపేట 1వ అదనపు జిల్లా జడ్జి
సిద్దిపేట, సెప్టెంబర్,30:సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు దండవేని ఇస్తారి (58)కి సిద్దిపేట 1వ అదనపు జిల్లా జడ్జి వై. జయప్రసాద్ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,01,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళపై దండవేని ఇస్తారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2019 ఏప్రిల్ 27న కోహెడ పోలీస్‌స్టేషన్‌లో...