భక్త మార్కండేయ స్వామి దేవస్థానం ఆవరణలో గణపతి పూజ
మహిళల భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
బెజ్జంకి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం ఆవరణలో గణపతి పూజ అనంతరం మహిళలపై కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేశారు.

