📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadభారీ వర్షంతో పాలేరు వాగు ప్రవాహ ఉధృతి

భారీ వర్షంతో పాలేరు వాగు ప్రవాహ ఉధృతి

📰 Generate e-Paper Clip

భారీ వర్షంతో పాలేరు వాగు ప్రవాహ ఉధృతి

ప్రజలు అటువైపు వెళ్ళవద్దని పోలీస్ హెచ్చరికలు

దంతాలపల్లి
మండలం పెద్ద ముప్పారం గ్రామ శివారు లోని పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి భారీగా నీటి ప్రవాహం రావడంతో మత్తడి పైనుంచి జల ప్రవాహం ఉరకలెత్తింది. దీని మూలంగా దంతాలపల్లి పెద్దముప్పారం గ్రామాల మధ్యలో ప్రజల యొక్క రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతిని తెలుసుకున్న దంతాలపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని, ప్రవాహ తీరును పరిశీలించారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల, మత్తడిదునికి నీరు ప్రవహించడంతో పెద్ద ముప్పారం గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత కొన్ని ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విషయంలో ఎవరు పట్టించుకుంటలేరని స్థానిక ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాహన దారులు నిత్యం మండల కేంద్రానికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు రోజంతా ప్రయాణానికి ఇబ్బంది తలెత్తింది. కురుస్తున్న వర్షానికి పాలేరు వాగు కు వరద ఉదృతి పెరిగి పెద్ద ముప్పారం గ్రామ పరిస్థితి ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంది దీనికి పూర్తిస్థాయిలో పరిష్కార మార్గం ప్రజా ప్రతినిధులు చూపాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ ప్రవాహం ఉధృతి తగ్గేవరకు ఇటు వైపు ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.