📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్విని...

సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రూ.10 కోట్ల పనులపై కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సన్నూరు ఆలయానికి పూర్ణకుంభంతో స్వాగతం – స్వామివారికి ప్రత్యేక పూజలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం
రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్షకు విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి, జిల్లా కలెక్టర్ సత్య శారద కి ఆలయ అర్చకులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో, వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

ఈ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ (SDF) నిధుల కింద రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్ పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

నిధులు కేటాయించిన వివరాలు :

111.08 × 111.08 అడుగుల విస్తీర్ణంలో కోనేరు నిర్మాణం రూ.261.89 లక్షలు,
అనివెట్టి మండపం నిర్మాణం రూ.57.28 లక్షలు, శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ నిర్మాణం రూ.15.94 లక్షలు, 1,344 అడుగుల ప్రాకార గోడ నిర్మాణం రూ.242.24, లక్షలు
పోర్టికో మండపం నిర్మాణం రూ.39.89 లక్షలు,
శివాలయ నిర్మాణం రూ.120 లక్షలు, ఆలయ సుందరీకరణ పనులు రూ.60 లక్షలు కేటాయించారు.

ఇప్పటివరకు అనివెట్టి మండపం, పోర్టికో మండపం, ప్రాకార గోడ, ఔటర్ ప్రాకార గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే అనివెట్టి మండపం, పోర్టికో మండపం సుందరీకరణ, ప్రాకార గోడ ప్రవేశ ద్వారాల నిర్మాణం, కోనేరు నిర్మాణం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శివాలయ నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్ పనులను త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం చేయవద్దని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, ఈ ఆలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా తీసుకొని మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.