ఎల్‌నినో ప్రభావం – వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన సమావేశం
స్థలం: రైతు వేదిక, బీర్కూర్
మండలం: బీర్కూర్, జిల్లా: కామారెడ్డి
ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోటు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, గ్రామాల్లో రైతులు తీసుకోవాల్సిన అత్యవసర ముందస్తు చర్యలు, పంటల మార్పిడి మరియు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు బీర్కూర్ రైతు వేదికలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు మరియు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, పంట మార్పిడి, నీటి పొదుపు చర్యలు, వ్యవసాయ ప్రణాళిక మరియు ఇతర ప్రత్యామ్నాయ విధానాలపై అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా, వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధికి హామీ మిషన్ (గ్రామీణ) – VB-G RAM G పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను వినియోగించుకుంటూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టగల పనులు మరియు గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఏపీఓ, మండల వ్యవసాయ అధికారి (MAO), విద్యుత్ శాఖ ఏఈ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) పాల్గొని రైతులకు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

